వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న వేళ.. కేంద్ర ఉక్కుశాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై ప్రస్తుతానికి ముందుకు వెళ్లడం లేదని అన్నారు
ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏపీలోని గుడివాడ(gudivada)లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయడు(chandrababu naidu) పర్యటించారు. ఈ క్రమంలో ఏపీలో వైసీపీ ప్రభుత్వం హాయంలో ఎస్సీలపై గతంలో కంటే దాడులు పెరిగాయని విమర్శించారు. అనేక రకాలు మాఫీయాలు చేస్తూ ప్రజలను దోచుకుంటున్నారని చంద్రబాబు ఆరోపించారు.
వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల ప్రాణాలకు ముప్పు ఉందని మాజీ మంత్రి, వైసీపీ నేత డీఎల్ రవీంద్రా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇద్దరూ జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు.
నాగార్జున సాగర్ నుంచి తెలంగాణ తన కోటా కంటే ఎక్కువగా నీటిని వినియోగించుకుందని ఏపీ జలవనరుల శాఖ KRMBకి తెలిపింది. మరోవైపు తమ రాష్ట్రానికి అత్యవసరంగా 7 టీఎంసీల నీరు అవసరం ఉందని..అందుకోసం తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించి తమకు ఇప్పించాలని లేఖలో కోరింది. ఈ విషయంలో తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరింది.
నారా లోకేశ్ యువగళం పాదయాత్రపై టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రశంసలు కురిపించారు. ఆయనో కర్మ జీవి.. గొప్ప లీడర్ అంటూ కొనియాడారు.
విచారణ పూర్తయి ఉదయ్ పాత్ర ఉందని గుర్తించిన పోలీసులు తండ్రి కొడుకులను అరెస్ట్చేసినట్లు సమాచారం. ఉదయ్ ను పులివెందుల నుంచి కడప జైలు అతిథిగృహానికి తీసుకెళ్లి విచారణ.
ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ లు అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు.
పరిపాలన రాజధానిగా విశాఖను చేయాలనే పట్టుదలతో ఉన్న సీఎం జగన్ (YS Jagan) ప్రభుత్వ స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని స్వాధీనం చేసుకునే ప్రక్రియ మొదలుపెట్టారు.