• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

3 నుంచి పుట్టపర్తిలో దేవి శరన్నవ రాత్రులు

ATP: పుట్టపర్తి పట్టణం చిత్రావతి రోడ్డులోని శ్రీదుర్గామాత దేవస్థానంలో అక్టోబర్ 3వ తేదీ గురువారం నుంచి 12వ తేదీ శనివారం వరకు దేవి శరన్నవరాత్రులు నిర్వహిస్తున్నామని దుర్గామాత ట్రస్ట్ సభ్యులు తెలిపారు. ఇందులో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తామన్నారు. పూజలకు భక్తులు సహకరించాలని కోరారు.

September 22, 2024 / 12:01 PM IST

టీడీపీలో చేరిన వైసీపీ కౌన్సిలర్లు

నెల్లూరు: బుచ్చిరెడ్డిపాలెం మండల వైఎస్సార్సీపీ పార్టీకి భారీ షాక్ తగిలింది. బుచ్చి నగర పంచాయతీ చైర్‌పర్సన్ మోర్ల సుప్రజా మురళితో పాటు 8 మంది కౌన్సిలర్లు టీడీపీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మంత్రి నారాయణ, అబ్దుల్ అజిజ్ పార్టీ కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించారు.

September 22, 2024 / 12:00 PM IST

నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించడమే లక్ష్యం: ఎమ్మెల్యే కన్నా

PLD: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ సమస్యను పారద్రోలేందుకు గుర్తింపు పొందిన కంపెనీలలో ఉద్యోగాల కల్పించినట్లు సత్తెనపల్లి MLA కన్నా లక్ష్మి నారాయణ తెలిపారు. ఆదివారం పట్నంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. నియోజకవర్గం నుంచి నిరుద్యోగ యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వారికి కేటాయించిన కేటగిరీల వారిగా ఇంటర్వ్యూలు చేశారు.

September 22, 2024 / 12:00 PM IST

జగన్‌కు ప్రజల విస్వాసాల పట్ల నమ్మకం లేదు: అచ్చెన్న

SRKL: మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ప్రజల విశ్వాసాలు, ధర్మంపై గౌరవం ఉండవు కాబట్టే పవిత్ర తిరుమలలో ఇటువంటి అపచారం జరిగిందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఎన్డీయే ప్రభుత్వంలో తిరుమల పవిత్రతకు పరిరక్షించి పూర్వ వైభవం తీసుకొస్తామని మంత్రి తెలిపారు. ఆదివారం ఈ సందర్భంగా కొత్తమ్మ తల్లి వార్షికోత్సవాల గోడ పత్రికను స్థానిక ఆలయం వద్ద ఆయన ఆవిష్కరించారు.

September 22, 2024 / 11:59 AM IST

ప్రమాదకరంగా ట్రాన్స్‌ఫార్మర్

KRNL: గోనెగండ్ల మండలం కులుమాల సచివాలయ సమీపంలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ప్రమాదకరంగా ఉంది. దాని చుట్టూ పిచ్చి మొక్కలు మొలకెత్తాయి. మూగజీవాలు గడ్డి తినడానికి అటుగా వెళ్తే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అధికారులు స్పందించి ట్రాన్స్‌ఫార్మర్ చుట్టు రక్షణగా కంచె ఏర్పాటు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.

September 22, 2024 / 11:58 AM IST

“ఓపెన్ మార్కెట్ షెడ్ ప్రారంభించిన ఎమ్మెల్యే”

WG: కాళ్ళ మండలం ఏలూరుపాడు గ్రామంలో ఓపెన్ మార్కెట్ షెడ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణం రాజు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులైన సందర్భంగా ‘ఇది మంచి ప్రభుత్వం’ కరపత్రాలను గ్రామస్తులకు అందించారు. అనంతరం మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని వృద్ధులకు, వితంతువులకు దుప్పట్లు పంపిణీ చేశారు.

September 22, 2024 / 11:55 AM IST

రేపు పాముదుర్తికి MLA రాక

ATP: బుక్కపట్నం మండలం పాముదుర్తి గ్రామంలో ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమం సోమవారం నిర్వహిస్తున్నట్టు టీడీపీ మండల కన్వీనర్ మల్లి రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటలకు జరిగే కార్యక్రమానికి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి హాజరవుతారని చెప్పారు. మండలంలోని తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని ఆయన కోరారు.

September 22, 2024 / 11:55 AM IST

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన: ఎమ్మెల్యే

ELR: ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రంలో NDA కూటమి పరిపాలన జరుగుతుందని ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు అన్నారు. ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఉంగుటూరు మండలం గొల్లగూడెం గ్రామంలో స్థానిక నాయకులు, అధికారులతో కలిసి ఎమ్మెల్యే ధర్మరాజు పర్యటించారు.

September 22, 2024 / 11:52 AM IST

పిచ్చికుక్కల దాడిలో 13 మందికి గాయాలు

ప్రకాశం: బెస్తవారిపేట మండలం ఆర్ కొత్తపల్లి, సలకల వీడు గ్రామాలలో పిచ్చికుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ఇప్పటివరకు పిచ్చికుక్కలు 13 మందిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. గాయపడ్డ వారందరినీ కంభం ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. పిచ్చికుక్కలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానిక ప్రజలు అంటున్నారు. అధికారులు స్పందించాలని కోరారు.

September 22, 2024 / 11:43 AM IST

రాష్ట్రస్థాయి జూడో పోటీలకు విద్యార్థి ఎంపిక

AKP: నర్సీపట్నం మండలం గబ్బడ హైస్కూల్లో పదో తరగతి చదువుతున్న పెట్ల చంద్రమౌళి రాష్ట్రస్థాయి జూడో పోటీలకు ఎంపికయ్యాడు. ఇటీవల అనకాపల్లిలో జరిగిన స్కూల్ గేమ్ ఫెడరేషన్ పోటీలలో ప్రథమ స్థానం సంపాదించి రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించాడు. తిరుపతిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో చంద్రమౌళి పాల్గొంటాడని పీడీ నాగేశ్వరరావు తెలిపారు.

September 22, 2024 / 11:40 AM IST

కార్యకర్తలకు అండగా ఉంటా: దూలం

కృష్ణా జిల్లా: వైసీపీ కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటానని ఆ పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు స్పష్టం చేశారు. నూజివీడు పట్టణంలో వైసీపీ ముఖ్య నాయకుల సమావేశంలో ఆదివారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 100 రోజుల ఉత్సవాలను కూటమి ఎందుకు చేస్తుందని ప్రశ్నించారు. ఇకపై కూటమి నేతలు ప్రజలలోకి వెళ్లే పరిస్థితి లేదని అన్నారు.

September 22, 2024 / 11:33 AM IST

ఘనంగా శ్రీ సత్యసాయి జన్మదిన వేడుకలు

కాకినాడ: తుని పట్టణంలో భగవాన్ శ్రీ సత్యసాయి జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా భక్తులు ఆదివారం ఉదయం నిర్వహించారు. దీనిలో భాగంగా పట్టణంలో ప్రత్యేక ఆధ్యాత్మిక శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం క్షత్రియ కళ్యాణ మండపంలో ప్రత్యేకపూజ కార్యక్రమాలు సైతం నిర్వహించారు. వేలాదిగా భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆధ్యాత్మిక ఆనందం పొందుతున్నారు.

September 22, 2024 / 11:29 AM IST

సుబ్రహ్మణ్యేశ్వరుడిని దర్శించుకున్న జిల్లా జడ్జి

NDL: పాణ్యం మండల పరిధిలోని శైవ పుణ్యక్షేత్రం ఎస్ కొత్తూరు గ్రామంలో వెలసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కర్నూలు జిల్లా జడ్జి కబర్థి ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో రామకృష్ణ, వేద పండితులు ఆలయ మర్యాదలతో ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందజేసి చేసి జడ్జిని సత్కరించారు.

September 22, 2024 / 11:27 AM IST

టీ అగ్రహారంలో పర్యటించిన టీడీపీ నాయకులు

KKD: శంఖవరం మండలం నెల్లిపూడి శివారు టీ అగ్రహారంలో ఎమ్మెల్యే సత్యప్రభ ఆదేశాలు మేరకు టీడీపీ నాయకులు ఆదివారం పర్యటించారు. సీసీ రోడ్లు స్మశానవాటికను పరిశీలించారు. గ్రామ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు బద్ది రామారావు, బద్ది వెంకటరమణ పాల్గొన్నారు.

September 22, 2024 / 11:25 AM IST

‘రాష్ట్ర రైతు సదస్సును జయప్రదం చేయండి’

ELR: ఈనెల 27న ద్వారకా తిరుమలలో ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న రాష్ట్ర రైతు సదస్సును జయప్రదం చేయాలని కోరుతూ మండలంలోని నారాయణపురం, గుణంపల్లి, ఎం.నాగులపల్లి, పంగిడిగూడెం గ్రామాలలో రైతు సంఘం నాయకులు ఆదివారం ప్రచారం నిర్వహించారు. ప్రచార కరపత్రాలను రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మర్రాపు సూర్యనారాయణ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.

September 22, 2024 / 11:23 AM IST