KRNL: కృష్ణగిరి మండలంలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ (NMMS)ను సద్వినియోగం చేసుకోవాలని ఎంఈఓ-2 మద్దయ్య ఓ ప్రకటనలో తెలిపారు. మండల వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో చదివే విద్యార్థులు ఈ నెల 24వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇంటర్ ప్రభుత్వ పాఠశాలల్లో చదివితే ఏడాదికి రూ.12వేల స్కాలర్షిప్ వస్తుందని చెప్పారు.