ఉమ్మడి జిల్లాలోని అంబేద్కర్ గురుకుల పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కన్వీనర్ ఉదయశ్రీ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 21న కురుగుంట బాలికల గురుకుల పాఠశాలలో డెమో నిర్వహించి ఎంపిక చేస్తామని తెలిపారు. ఆసక్తి ఉన్నవారు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని కోరారు.