PPM: ఎటువంటి అనుమతులు, లైసెన్స్లు లేకుండా మాంసం విక్రయాలు చేపట్టకూడదని జిల్లా ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారి( DFSO) వినోద్ కుమార్ హెచ్చరించారు. ఇవాళ వీరఘట్టంలో మటన్ విక్రయాలను ఆయన పరిశీలించారు. రోడ్డు పక్కన ఎక్కడపడితే అక్కడ మటన్ విక్రయించవద్దని, సమీప మార్కెట్లో ఒకే చోట మటన్ విక్రయాలు చేపట్టాలని సూచించారు. ఆయనతోపాటు వీరఘట్టం MPDO వెంకటరమణ ఉన్నారు.