TPT: దొరవారిసత్రం మండలం, సురపు అగ్రహారం అటవీ ప్రాంతంలో డ్రోన్ సహాయంతో శనివారం పేకాట ఆడుతున్న ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఎస్సై అజయ్ కుమార్ కథనం మేరకు, మండలంలోని సురపు అగ్రహారం అటవీ ప్రాంతంలో పేకాట ఆడుతున్న ఐదుగురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.4130 నగదు సీజ్ చేశామని తెలిపారు.