VZM: నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవిని ఆదివారం గ్రామీణ వైద్యుల సంఘ ప్రతినిధులు మర్యాద పూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 2017లో సీఎం చంద్రబాబు జీవో-465 ఇచ్చారని, అది కార్యరూపం దాల్బలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రేపటి నుండి ప్రారంభం కానున్న శాసనసభ సమావేశాల్లో జీరో అవర్లో RMP గ్రామీణ వైద్యుల సంఘం గురించి మాట్లాడాలని కోరారు.