W.G: భీమవరంలో ప్రత్యేక ఉపకారాగారాన్ని అధునాతనంగా తీర్చిదిద్దారు. ఇప్పటివరకు పురుషులకు మాత్రమే లాకప్ ఉండేది. ప్రస్తుతం మహిళలకూ ఏర్పాటు చేశారు. 8మంది ఉండేందుకు అనువుగా నిర్మించారు. సాధారణ లాకప్‌లో 62 మంది ఉండొచ్చు. ఏడాదిగా కారాగారం అభివృద్ధి పనులు జరగడంతో ఇప్పటివరకు ఖైదీలను ఏలూరు, తణుకు, నరసాపురంలో ఉన్న కారాగారాల్లో ఉంచారు.