»Dsc Notification After Sankranthi In Andhrapradesh
DSC Notification : గుడ్ న్యూస్ .. సంక్రాంతి తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్
టీచర్ పోస్టుల కోసం ఎదురుచూస్తున్న వారికి ఏపీ సర్కార్ శుభవార్త అందించింది. సంక్రాంతి తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు.
DSC Notification : టీచర్ పోస్టుల కోసం ఎదురుచూస్తున్న వారికి ఏపీ సర్కార్ శుభవార్త అందించింది. సంక్రాంతి తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ఒక్కో జిల్లాకు ఎన్ని పోస్టులు ఉంటాయో త్వరలో విడుదల చేయనున్నారు. పండుగ తర్వాత మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఆయన వెల్లడించారు. ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తారు. విధివిధానాలు త్వరలో ప్రకటిస్తారు. ఇప్పటికే ముఖ్యమంత్రితో చర్చించామని తెలిపారు. ఈరోజు నాలుగో జాబితా విడుదలవుతుందన్న ప్రచారాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ తోసిపుచ్చారు. ఇప్పట్లో ఎలాంటి ప్రకటన లేదని, సమాచారం ఉంటే అందరికీ ఫోన్ చేసి చెబుతామని స్పష్టం చేశారు.