KKD: విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ (ఏఐఎస్ఎఫ్) కాకినాడ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం అంబేద్కర్ విగ్రహం వద్ద విద్యార్థుల సమస్యల పరిష్కరించాలని నిరసన ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా ఏఐఎస్ఎఫ్ కాకినాడ జిల్లా కన్వీనర్ ముమ్మిడి సతీష్ హాజరై మాట్లాడుతూ.. విద్య, వైద్య రంగాలను ప్రైవేటీకరణ చేస్తే ఉద్యమిస్తామన్నారు.