SKLM: వంగర మండలం సంగాం గ్రామంలో వెలసిన పుణ్య క్షేత్రం శ్రీ సంగమేశ్వర స్వామి వారిని రాజాం రూరల్ సీఐ హెచ్ ఉపేంద్రరావు, లావణ్య దంపతులు ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు సిద్ధాంతం శంకర్ రావు మహన్యాస పూర్వక రుద్రాభిషేకం, పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులతో కార్తీక మాసం ఏర్పాట్లపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.