అనకాపల్లి: అటవీ సిబ్బందిపై దాడి చేసిన మల్కాపురం ఎమ్మెల్యే అనుచరులపై చర్యలు తీసుకోవాలని నర్సీపట్నం అటవీ శాఖ కార్యాలయం వద్ద అటవీశాఖ సిబ్బంది గురువారం నల్ల బ్యాడ్జీలతో ఆందోళన చేపట్టారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ ఘటనపై వెంటనే స్పందించి సీఎం డిప్యూటీ స్పందించి దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.