»Brs Governament Scams Have Happened In All Sectors In Telangana Jp Nadda
JP Nadda: తెలంగాణలో అన్ని రంగాల్లో స్కామ్స్ జరిగాయి
తెలంగాణలో BRS పార్టీ భ్రష్టాచార్ రిశ్వత్ సర్కార్‌గా మారిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(jp nadda) శుక్రవారం పేర్కొన్నారు. 2014లో మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ(telangana)ను..నేడు రూ.3.29 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయేవిధంగా బీఆర్ఎస్(BRS) చేసిందని ఆరోపించారు. అలాంటి పార్టీకి రాష్ట్రంలో అధికారంలో కొనసాగే హక్కు లేదని నడ్డా అన్నారు. తెలంగాణ, ఏపీలో బీజేపీ జిల్లా కార్యాలయాలను వర్చువల్ విధానంలో ప్రారంభించిన క్రమంలో నడ్డా ఈ వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో అన్ని రంగాల్లో కుంభకోణాలు జరుగుతున్నాయని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(jp nadda) శుక్రవారం ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్(BRS) ప్రభుత్వానికి ఏటీఎంగా మారిందని పేర్కొన్నారు. ప్రాజెక్టు వ్యయం రూ.40 వేల కోట్ల నుంచి 1.40 లక్షల కోట్లకు పెంచారని గుర్తు చేశారు. ఆ క్రమంలో వారికి అనుకూలంగా ఉన్న వారికి కంట్రాక్టులు ఇచ్చుకుని వేల కోట్ల రూపాయలు కమిషన్ తీసుకున్నారని విమర్శించారు. ఇలా ఒక్క కాళేశ్వరం మాత్రమే కాదు అనేక ప్రాంతాల్లో కొత్త భవనాలు, పార్టీ కార్యాలయాలు, కొత్త సచివాలయం సహా అనేక కట్టడాల్లో కేసీఆర్(KCR) కమిషన్ తీసుకున్నారని ఆరోపించారు.
ఇలాంటి పార్టీకి తెలంగాణలో అధికారంలో కొనసాగే హక్కు లేదని జేపీ నడ్డా(jp nadda) వెల్లడించారు. బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం అంటే భ్రష్టాచార్య రిశ్వత్ సర్కార్ అని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) భారత రాష్ట్ర సమితి (BRS)గా మారిన క్రమంలో అది పేరు మార్చుకుంది, కానీ అది తన తీరును మాత్రం మార్చుకోలేదని దుయ్యబట్టారు. ఇంకోవైపు ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీఎం కేసీఆర్ కుమార్తె కవితకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) సమన్లు ఇచ్చిన అంశాన్ని నడ్డా ప్రస్తావించారు. ఇది దౌర్భాగ్య పరిస్థితి అని, తెలంగాణ ప్రతిష్ట మరింత దిగజారిందని చెప్పారు. టీఆర్ఎస్, బీఆర్ఎస్లు ఒకటేనని తెలంగాణ ప్రజలకు తెలుసునని అన్నారు. తెలంగాణ ప్రజలు మీకు VRS (స్వచ్ఛంద పదవీ విరమణ పథకం) ఇస్తారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
అనేక స్కాంలో పేరుతో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని(Telangana) దోచుకుందని నడ్డా పేర్కొన్నారు. ఈ క్రమంలో 2014లో మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ప్రస్తుతం రూ.3.29 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని గుర్తు చేశారు. ఇంకోవైపు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయిందని బీజేపీ చీఫ్ చెప్పారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌కు మోదీ ప్రభుత్వం అన్ని విధాలా సాయం చేస్తోందని చెప్పారు. కానీ తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేయడంలో విఫలమైందని అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కొత్త బీజేపీ జిల్లా కార్యాలయాలను వర్చువల్ విధానంలో ప్రారంభించిన క్రమంలో నడ్డా ప్రసంగించారు.
Virtually inaugurated BJP's district offices in Telangana & Andhra Pradesh. These offices will serve as the nerve center of our party's activities in these regions & strengthen our organizational structure while enabling our karyakartas to work for the betterment of the people. pic.twitter.com/dIeyIxXTnU