అన్నమయ్య: పుల్లలచెరువు MEO ఎం.డి. ఖాసిం మండలంలోని ఎండ్రపల్లి, వెంకటరెడ్డిపల్లెలోని ప్రాథమిక పాఠశాలలను ఆకస్మికంగా శనివారం తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు, సామర్థ్యాలు, పాఠశాల రికార్డులు పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయవలసిన బాధ్యత మన అందరిపై ఉందని చెప్పారు. మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం అందించాలన్నారు.