కోనసీమ: మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురం గ్రామ పంచాయతి పరిధిలో చింతలపల్లి – మలికిపురం రోడ్డు మార్గంలో ఉన్న కల్వర్టు శిధిలావస్థకు చేరుకుంది. ఆ స్థానంలో నూతన కల్వర్టు నిర్మాణ పనులకు ఆదివారం ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ భూమి పూజ చేశారు. రూ.32 లక్షల వ్యయంతో కల్వర్టు నిర్మాణం జరుగుతుందని ఆయన తెలిపారు. కూటమి నాయకులు పాల్గొన్నారు.