కృష్ణా: విజయవాడకు చెందిన మెడికో ప్రణీత్ తగరపువలసలో సూసైడ్ చేసుకున్న ఘటనపై తల్లి మీడియాతో మాట్లాడారు. పరీక్షలో ప్రణీత్ వద్ద స్లిప్పులు లేకపోయినా పేపర్ లాక్కున్నారని ఆరోపించారు. తర్వాత డీన్ వచ్చి 25 నిమిషాలు మాట్లాడారన్నారు. ‘నీకు ఇంకా లైఫ్ లేకుండా చేస్తా, డాక్టర్ ఎలా అవుతావో చూస్తా’ అని తిట్టారని తోటి విద్యార్థులు చెప్పారన్నారు.