CTR: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకంలో ఈ నెల 27వ తేదీ నుంచి నిర్వహించనున్న వరసిద్ధుడి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లను ఈవో పెంచలకిశోర్ పర్యవేక్షణలో సిబ్బంది త్వరితగతిన పనులు చేస్తున్నారు. కాగా, ఆలయం వద్ద చలువ పందిళ్లు, రంగుల ముగ్గులు, పెయింటింగ్, విద్యుద్దీపాలంకరణ కోసం అవసరమైన వస్తువులు, పరికరాలను తీసుకొచ్చారు.