NLR: జిల్లా వ్యవసాయ అధికారి సత్యవాణి మంగళవారం కొడవలూరు మండలంలో పర్యటించారు. అనంతరం మండలంలోని గుండాలమ్మ పాలెం, వెంకన్నపాలెం గ్రామాల్లో పొలం పిలుస్తుంది కార్యక్రమానికి విచ్చేశారు. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని అమ్ముకోవాలన్నారు. రైతులు ఏమైనా సమస్యలు ఎదుర్కొంటుంటే తమ దృష్టికి తీసుకొని రావాలన్నారు.