ATP: పెద్దవడుగురు మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో శనివారం సర్వ ఏకాదశి, కార్తీక మాసం రెండో శనివారం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. ఆలయంలో స్వామివారి మూలమూర్తికి తులసి, తమలపాకులతో ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.