GNTR: గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని చౌత్ర సెంటర్లో ఎమ్మెల్యే నజీర్ శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి మురుగు కాలువలు, రోడ్లను పరిశీలించారు. కాలువల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాలను చూసి ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. పండుగలు వస్తున్న తరుణంలో కూడా పారిశుద్ధ్యం సరిగా లేకపోవడంపై మున్సిపల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.