ప్రకాశం: కనిగిరి ఆర్టీసీ డిపోలో రిజర్వేషన్ కౌంటర్ కొరకు టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు డిపో మేనేజర్ మహమ్మద్ సయనా బేగం తెలిపారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ.. రిజర్వేషన్ కౌంటర్తోపాటు మరుగుదొడ్లు మెయింటెనెన్స్కు టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మరన్ని వివరాలకు డిపో మేనేజర్ కార్యాలయాన్ని సంప్రదించాలని ఆమె కోరారు.