CTR: గుడిపాల, ముత్తువాళ్ళూరు గ్రామంలో ఏనుగుల గుంపు పంట పొలాలపై దాడులు చేసి నాశనం చేశాయి. విషయం తెలుసుకున్న చిత్తూరు ఎమ్మెల్యే తండ్రి గురజాల చెన్నకేశవుల నాయుడు ఏనుగు దాడిలో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించి, సంబంధిత రైతులతో మాట్లాడారు. ఫారెస్ట్, వ్యవసాయ, రెవెన్యూ అధికారులతో మాట్లాడి నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నుంచి పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.