CTR: ఏపీ సీఎం చంద్రబాబు గారు సోమవారం తన స్వగ్రామమైన నారావారి పల్లెకు వెళ్లనున్నారు.సంక్రాంతి పండుగను పురస్కరించుకొని నారావారిపల్లెలో కుటుంబ సభ్యులతో కలిసి పండుగను జరుపుకోనున్నారు.12 నుంచి 15 వరకు తమ స్వగ్రామంలో బసచేయనున్నారు. అనంతరం 140 కోట్లతో పలు పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. రూ.20 కోట్లతో చేపట్టిన పలు పనులను ప్రారంభించనున్నారు.