కృష్ణా: నందిగామ పట్టణంలో బుధవారం ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా నందిగామ ఎమ్మెల్యే కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.ఈ కార్యక్రమానికి నందిగామ శాసనసభ్యులు తంగిరాల సౌమ్య ముఖ్యఅతిథిగా హాజరవుతారని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రజలు సమస్యలను లిఖితపూర్వకంగా అందించాలని ఎమ్మెల్యే కార్యాలయం కోరింది.