సత్యసాయి: రబీ సీజన్‌కు సంబంధించి ఉద్యాన పంటల పరంగా టమోటా పంటను పంటల బీమా పథకంలో గుర్తించడం జరిగిందని జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. జిల్లాలో టమోటా పంటను బీమా చేసే సదుపాయం IFFCO TOKIO అనే కంపెనీకి ఇవ్వడం జరిగిందని, ఒక ఎకరాకి కంపెనీ వారు రూ. 32,000 వరకు పంటను బీమా చేస్తారని, దీనికి రైతు 10శాతం బీమా ప్రీమియం చెల్లించాలన్నారు.