అన్నమయ్య: జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా మదనపల్లెకు చెందిన నిగర్ సుల్తానా నియమితులు అయ్యారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గాజుల భాస్కర్ ఈ మేరకు ఆమెకు మంగళవారం రాయచోటిలోని డీసీసీ కార్యాలయంలో నియామక పత్రాలు అందజేశారు. ఆమె మాట్లాడుతూ.. పార్టీ బలోపేతం కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు.