PPM: కురుపాం మండలంలో జీలుగలు సేవించి ఆస్వస్థతకు గురైన పలువురికి తక్షణమే చికిత్స అందించినట్లు కలెక్టర్ డా.ప్రభాకరరెడ్డి పేర్కొన్నారు. జీలుగల్లు సేవించి తీవ్రమైన విరేచనాలతో బాధపడుతున్న నలుగురు వ్యక్తులను స్థానిక పీహెచ్సీకి తరలించడం జరిగిందన్నారు. దీనిపై జాయింట్ కలెక్టర్ సత్వరం స్పందించి సంబంధిత వైద్యారోగ్య శాఖ అధికారులకు సూచనలు చేశారని స్పష్టం చేశారు.