SKLM: కేంద్ర మంత్రి, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడును న్యూఢిల్లీలో ఏపీ విప్, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు నియోజకవర్గంలో నెలకొన్న పలు సమస్యలను కేంద్రమంత్రికి వివరించి, వినతిపత్రం అందజేశారు. మున్సిపాలిటీలోని బహుద నదిపై నూతన వంతెన నిర్మాణం చేపట్టాలని వినతిలో తెలిపారు.