ASR: డుంబ్రిగూడ మండలంలోని కాగువలస, బరియకాలువలస గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించాలని స్థానిక గిరిజనులు కోరుతున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… గ్రామంలో సుమారు 150 మంది జనాభా కలిగి ఉన్నామని రహదారి సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, అత్యవసర సమయాలలో కనీసం అంబులెన్స్ రాలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.