VZM: వల్లంపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సై బి.దేవి, సిబ్బందితో శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా వావిలపాడు గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన ఓ మహిళా వద్ద 6 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకొన్నట్లు తెలిపారు. ఆమెపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. గ్రామాల్లో అక్రమంగా మద్యం బాటిళ్లు, నాటుసారా తయారు చేస్తే కఠిన చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు.