W.G: ఫిబ్రవరి 12 కేంద్ర కార్మిక సంఘాలు తలపెట్టిన దేశవ్యాపిత సార్వత్రిక సమ్మె విజయవంతం చేయాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కోనాల భీమారావు పిలుపునిచ్చారు. ఆదివారం తణుకులో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 36 కార్మిక చట్టాలను రద్దు చేసి కార్మికులకు వ్యతిరేకంగా కేంద్రం పని చేస్తుందని ఆరోపించారు.