ELR: బుట్టాయగూడెం మండలంలో మారుమూల గ్రామం ముంజులూరులో డాక్టర్ ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో గురువారం వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు కేఆర్‌పురం ఇంఛార్జ్ డిప్యూటీ డీఎం సురేష్ కుమార్ తెలిపారు. అన్నిరకాల వైద్య పరీక్షలు చేసి, చికిత్సలు అందించి మందులు ఇస్తారని పేర్కొన్నారు. చుట్టు పక్కల గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.