VZM: గంట్యాడ మండలంలోని కొటారబిల్లి గ్రామంలో కనకదుర్గమ్మ తల్లిని గజపతినగరం మాజీ శాసనసభ్యులు బొత్స అప్పలనరసయ్య శనివారం దర్శించుకున్నారు. ముందుగా ఆలయం అర్చకులు అప్పలనరసయ్యకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అప్పలనరసయ్య ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గజపతినగరం మాజీ ఏఎంసీ ఛైర్మన్ వేమలి ముత్యాలనాయుడు పాల్గొన్నారు.