ప్రకాశం: అద్దంకి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఈనెల 17వ తేదీన ఆదివారం కార్తీక వన సమారాధన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సంఘ అధ్యక్షులు హనుమంతరావు తెలిపారు. ఈ సందర్భంగా వారు ఆదివారం కరపత్రాలను ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 17వ తేదీన జరిగే వన సమారాధన కార్యక్రమానికి బ్రాహ్మణ సేవా సంఘస్తులు అందరూ హాజరుకావాలని కోరారు.