KDP: పేద కుటుంబాలు సీఎంఆర్ఎఫ్ కోసం అప్లై చేసుకోవాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి తెలిపారు. బుధవారం కడప నియోజకవర్గంలోని లబ్ధిదారులకు రూ.8,35,192 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజా సమస్యలు త్వరగతిన పరిష్కరిస్తూ, ప్రజలకు అన్ని విధాలుగా సహాయ సహకారాలను అందిస్తుందని తెలియజేశారు.