ATP: బ్రహ్మాసముద్రం మండలం గొంచిరెడ్డిపల్లి గ్రామంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. మహిళలతో మాట్లాడి ఉచిత బస్సు ప్రయాణం ఎలా ఉందని ఆరా తీశారు. ఈ సందర్భంగా మహిళలు సంతోషం వ్యక్తం చేశారని ఎమ్మెల్యే తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుందని పేర్కొన్నారు.