ATP: గుండెపోటుతో అనంతపురం కిమ్స్ సవేరా ఆసుపత్రిలో చేరిన సింగనమల వైసీపీ మండల కన్వీనర్ పూల ప్రసాద్‌ను మాజీ మంత్రి సాకే శైలజనాథ్ పరామర్శించారు. ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ప్రసాద్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితుడి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.