SKLM: నరసన్నపేట మండలం దేవాదిగ్రామంలో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల స్టాల్స్‌ను ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఇవాళ సందర్శించారు. అనంతరం అయన మాట్లాడుతూ.. రైతులు ఎటువంటి రసాయలు లేకుండా పండించిన ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను అందించాలని అన్నారు. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల స్టాల్స్ ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.