VSP: భీమిలి తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రెవెన్యూ సేవల్లో పారదర్శకత, బాధ్యత పెరగాలని తెలిపారు. పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ ఫిర్యాదులు, మ్యూటేషన్ దరఖాస్తులను సమీక్షించి, ప్రజా సమస్యలకు నాణ్యమైన పరిష్కారం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.