VZM: హరిత రాయబారుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కొత్తవలస ఇన్‌ఛార్జి ఎంపీడీవో బొజ్జా నాగేంద్ర ప్రసాద్‌కు సీఐటీయు యూనియన్ జిల్లా కార్యదర్శి రమణ గురువారం వినతిపత్రం అందజేశారు. ప్రజల ఆరోగ్య రక్షణపై పారిశుధ్య కార్మికులు ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తున్నారని వినతిపత్రంలో పేర్కొన్నారు. వారికి సకాలంలో జీతాలు చెల్లించే విషయంలో ప్రభుత్వం నిర్లక్షం వహిస్తుందన్నారు.

