కోనసీమ: అంగారక సంకట హర చతుర్థి సందర్భంగా మంగళవారం ఆలమూరు మండలం పెదపళ్ళ బాలగణపతి, చింతలూరు లక్ష్మీ గణపతి ఆలయాల్లో అభిషేకాలు, అర్చనలు, గరిక పూజలు నిర్వహించారు. చింతలూరులో సంకట హర గణేశ హోమం నిర్వహించారు. భక్తులు అధికసంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.