ATP: జిల్లా పోలీసులకు దైనందిన విధులకు వినియోగించే ఫోర్స్ ట్రావెలర్ వాహనాన్ని పవర్ గ్రిడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా, గుత్తి వారు వితరణ చేశారు. ఈ నూతన వాహనాన్ని జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణలో జిల్లా ఎస్పీ పీ. జగదీష్ ఆవిష్కరించారు. వితరణగా అందజేసిన ఫోర్స్ ట్రావెలర్ సేవలు జిల్లా పోలీసుశాఖకు ఎంతగానో ఉపయోగపడుతాయని, సదరు సంస్థకు జిల్లా ఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు.