కర్నూలు ఎన్టీఆర్ బిల్డింగ్లో నివసించే సాయిపోగు హనుమంతు వృత్తిరీత్యా పెయింటర్. ఆయన కూతురు బ్లెస్సీ MBBS సీటు సాధించడంతో బీఎస్పీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు గద్దల లాజర్,పెయింట్ యూనియన్ సభ్యులు ఏసన్న, రాజ, జీవ రాజ్ కుమార్ కుటుంబాన్ని శుక్రవారం అభినందించారు. సందర్భంగా లాజర్ మాట్లాడుతూ.. విద్య ద్వారానే ఆర్థిక అభివృద్ధి, ఆత్మగౌరవం సాధ్యమవుతాయని తెలిపారు.