ATP: పెద్దపప్పూరు మండలం అశ్వర్థంలో 25 నుంచి ప్రారంభమయ్యే శ్రీ అశ్వర్థ నారాయణ స్వామి బ్రహ్మోత్సవాలపై అధికారులు శనివారం సమీక్ష నిర్వహించారు. అనంతపురం ఆర్డీవో, సీఐ రామసుబ్బయ్య, ఈవో సుబ్రహ్మణ్యం ఏర్పాట్లపై చర్చించారు. బందోబస్తు, వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ మళ్లింపు వంటి అంశాలపై దిశానిర్దేశం చేశారు.