ప్రకాశం: కొండపి సర్కిల్ పరిధిలోని ఎస్సైలతో సీఐ ఇవాళ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో రౌడీ షీటర్ల ప్రస్తుత పరిస్థితి, వారి కదలికలు, గత నేర చరిత్రపై సమగ్రంగా చర్చించారు. రౌడీ షీటర్లపై నిరంతర నిఘా కొనసాగించాలని, వారు మళ్లీ నేరాలకు పాల్పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.