సత్యసాయి: తిరుమలలో జరిగిన తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి మొదటి సమావేశానికి మడకశిర శాసన సభ్యులు MS రాజు హాజరయ్యారు. సమావేశంలో సాధారణ భక్తులకు ఇబ్బంది లేకుండా దర్శనం చేపించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా భక్తులకు అందించే సేవలను మరింత మెరుగైన ఏర్పాట్లు చేసి అందించాలని సూచించారు. గత పాలకమండలి చేసిన తప్పిదాలను జరగకుండా చూడాలని కోరారు.