కాకినాడ: సామర్లకోట పట్టణంలో గత రెండు గంటలుగా కురిసిన భారీ వర్షం కారణంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణం ముంపుకు గురైంది. వర్షం పడుతున్న రూమ్స్లోనే విద్యార్థులకు ఉపాధ్యాయులు విద్యాబోధన చేస్తున్నారు. కళాశాల భవనం శిథిలావస్థకు చేరడంతో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు. కళాశాల భవనాన్ని మార్మాట్లకు స్పందించాల్సిన అవసరం ఉందని పలువురు సూచిస్తున్నారు.