అనంతపురం: జిల్లా కేంద్రంలో టీమిండియా స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ ఆదివారం సందడి చేశారు. దులీప్ ట్రోఫీ క్రికెట్ మ్యాచ్లో పాల్గొనేందుకు వచ్చిన క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ ట్రోఫీ మ్యాచ్ అనంతరం నగరంలోని వైసీపీ రాష్ట్ర నాయకుడు హరీష్ కుమార్ యాదవ్ ఇంటికి వెళ్ళారు. ఈ సందర్భంగా సూర్యకుమార్ యాదవ్ హరీష్ కుమార్ యాదవ్ ఇంటిలో అందరితో మమేకమై సందడిగా గడిపారు.