SKLM: లంపీ స్కిన్ (ముద్ద చర్మపు వ్యాధి) వ్యాధితో పశువులు మృత్యువాత పడుతున్నాయి. పశువుల శరీరంపై పెద్ద పెద్ద పుండ్లు ఏర్పడి రక్తస్రావం అవుతుంది. దీంతో తీవ్ర అనారోగ్యం గురై మృత్యువాత పడుతున్నాయి. లావేరు, రణస్థలం, ఎచ్చెర్ల, జీ.సిగడాం మండలాల పరిధిలో సుమారు లక్ష పైగా పశువులు ఉండగా వాటిలో 10వేల పశువుల వరకు ఈ వ్యాధి బారినపడ్డాయి.