ASR: అనంతగిరి మండలం వేంగడ నుంచి డొంకపుట్టు గ్రామం వరకు రోడ్డుకు ఇరువైపులా 5 కి.మీ వరకు ఉన్న తుప్పలను గిరిజన సంఘం, మోటార్ యూనియన్ నాయకులు, యువకులు కలిసి శ్రమదానంతో గురువారం తొలగించారు. రోడ్డుకు ఇరువైపులా తుప్పలు పేరుకుపోయి ఎదురెదురుగా వస్తున్న వాహనాలు కనిపించకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని దీంతో తొలగించామని తెలిపారు.